చైనాకు మరో షాక్.. ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేసిన ఆస్ట్రేలియా
Australia Joins US In Diplomatic Boycott | డ్రాగన్ దేశం చైనాకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా బాయ్‌కాట్

కాన్బెర్రా : డ్రాగన్ దేశం చైనాకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా సైతం అమెరికాతో కలిసి వెళ్లనున్నట్లు ప్రకటించింది. దౌత్యపరంగా ఒలింపిక్స్ గేమ్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ బుధవారం తెలిపారు. ఇటీవలి చైనాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత గేమ్స్‌ను బహిష్కరించడంలో ఆశ్చర్యం లేదని, నిర్ణయం సరైందేనన్నారు.
దౌత్యపరంగా గేమ్స్‌ను బాయ్‌కాట్ చేసినా.. అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారన్నారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలను ఉటంకిస్తూ.. ‘ముఖ్యంగా ఇటీవల అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కొనుగోలు చేయాలనే మా నిర్ణయానికి సంబంధించింది. ఈ ప్రాంతంలో బలమైన రక్షణ దళాన్ని కలిగి ఉండేందుకు ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయత్నాలను చైనా విమర్శించింది’ అన్నారు. తమతో ఉన్న విభేదాలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని, ఇందుకు డ్రాగన్ దేశం అంగీకరించడం లేదన్నారు.
ఇప్పటికే అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యపరంగా క్రీడలను బహిష్కరించడాన్ని ఖండించిన డ్రాగన్ దేశం.. పగ తీర్చుకుంటామని హెచ్చరించింది. అయితే, ఫిబ్రవరిలో జరిగే వింటర్ క్రీడలకు 40 నుంచి అంతకంటే ఎక్కువ మందిని అథ్లెట్లను గేమ్స్‌కు పంపాలని భావిస్తుండగా.. మోరిసన్ ప్రకటన దీనిపై ప్రభావం చూపబోదని ఆస్ట్రేలియన్ ఒలిపింక్ కమిటీ పేర్కొంది. అథ్లెట్లను సురక్షితంగా బీజింగ్‌కు చేర్చడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం అతిపెద్ద సవాల్‌గా మారిందని కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్ కారోల్ పేర్కొన్నారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

