ఎనీమియా రహిత కరీంనగర్‌ను తయారు చేద్దాం: జడ్పీ చైర్పర్సన్
Kanumalla Vijaya: కరీంనగర్ జిల్లాను ఎనీమియా రహితం చేద్దామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపునిచ్చారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాను ఎనీమియా రహితం చేద్దామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపునిచ్చారు. జిల్లాను ఎనీమియా ఫ్రీ జోన్‌గా మార్చేందుకు జిల్లా పాలనా యంత్రాంగం కష్టపడి పనిచేయాలని ఆమె కోరారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళాశిశు సంక్షేమ శాఖ పోషకాహార లోపం ఉన్న పిల్లలకు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ విజయ.. మహిళలు ఎనీమియాను అధిగమించేందుకు సహకారం అందిస్తున్న జిల్లా పాలనాయంత్రాంగాన్ని అభినందించారు. ఇక ముందు కూడా ఇదే పనితీరును కొనసాగించాలని అధికారులను కోరారు. ఎనీమియా సమస్యను అధిగమించడంలో కరీంనగర్ జిల్లాను దేశానికే రోల్ మోడల్‌గా మార్చారని జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు.
పోషకాహార లోపం ఉన్న పిల్లలకు చిరు ధాన్యాలతో కూడిన ప్రత్యేక ఆహారాన్ని సమకూర్చాలన్న నిర్ణయం చాలా గొప్పదని జడ్పీ చైర్పర్సన్ అన్నారు. ఒక జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మహిళలకు రక్త పరీక్షలు చేయడం దేశంలోనే మొదటిసారి అని పొగిడారు. పోషక విలువలున్న ఆహారం, ఐరన్ ట్యాబ్లెట్లతో ఎనీమియాను అధిగమించడం సాధ్యమేనని ఆమె చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా సంక్షేమ అధికారి కే సబిత, కార్పొరేటర్ జితేందర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, డీఎంహెచ్‌వో జువేరియా, డీఆర్డీఏ పీడీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

