స్టార్టప్‌లకు అడ్డా టీ హబ్
హైదరాబాద్‌కు చెందిన మొట్ట మొదటి స్టార్టప్‌ల్లో ఒకటి జెనోటి. శ్రీనగర్‌కాలనీ కేంద్రంగా 2010లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం దేశ,విదేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అంతేకాదు జెనోటి ప్రస్తుతం యునికార్న్ హోదాను సాధించింది. సుమారు 1000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకులు ఆనంద్ అరవింద్ వివిధ దేశాల్లో కంపెనీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. ఆయన టీ హబ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా నగరానికి విచ్చేశారు
జెనోటి వ్యవస్థాపకులు ఆనంద్ అరవింద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన మొట్ట మొదటి స్టార్టప్‌ల్లో ఒకటి జెనోటి. శ్రీనగర్‌కాలనీ కేంద్రంగా 2010లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం దేశ,విదేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అంతేకాదు జెనోటి ప్రస్తుతం యునికార్న్ హోదాను సాధించింది. సుమారు 1000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకులు ఆనంద్ అరవింద్ వివిధ దేశాల్లో కంపెనీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. ఆయన టీ హబ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా నగరానికి విచ్చేశారు. ఆయనతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ…
మీ స్టార్టప్‌ను ప్రారంభించినప్పుడు, ఇప్పటికీ నగరంలో ఎలాంటి మార్పులు చూశారు.?
ఆనంద్ అరవింద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలో స్టార్టప్‌ను 2010లో ప్రారంభించాం. మేనేజ్ మైస్పా పేరుతో టెక్నాలజీ స్టార్టప్‌గా మా ప్రయాణం మొదలైంది. అప్పుడు ఇలాంటి వేదిక (టీహబ్ లాంటిది) లేదు. ఇన్నో ఇబ్బందులు పడుతూ స్నేహితులతో కలిసి స్పాలు,హెయిర్ సెలూన్ వంటి సేవలను అందించే సంస్థలకు సాప్ట్వేర్ ఆప్లికేషన్లు రూపొందించి ఇచ్చాం. అప్పుడు చాలా ఒంటరి తనం అనిపించేది. కానీ ప్రస్తుతం స్టార్టప్‌లకు అవసరమైన వనరులన్నీ ఒకే చోట కల్పించడం నేటి వ్యవస్థాపకులకు అద్బుతమైన వేదికగా చెప్పవచ్చు.
యునికార్న్‌గా గుర్తింపు పొందిన మీరు నేటి ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులకు ఇచ్చే సందేశం ఏమిటి?
ఆనంద్ అరవింద్: టీహబ్ లాంటి వేదిక ఉంటే మరింత వేగంగా తమ ఆలోచనలను వ్యాపార నమూనాలుగా మార్చే అవకాశం ఉంది. దీనిని ఒక అద్బుత అవకాశంగా భావించాలి. ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని దేశ,విదేశాలకు చెందిన టెక్నాలజీ నిపుణులు, ఇన్వెస్టర్లతో నెట్ వర్కింగ్ ఏర్పాటు చేయిస్తున్నారు.
స్టార్టప్‌లకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉంది?
అనంద్ అరవింద్: ఖచ్చితంగా టెక్నాలజీ స్టార్టప్‌లకే ఉందని చెప్పవచ్చు. టెక్నాలజీ ద్వారా ఎన్నో ఆద్భుతాలు నేటి యువతరం చేస్తున్నది. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి, సమాజానికి అవసరమైన విధంగా మెరుగైన సేవలను అందించేందుకు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలో ఆలోచించాలి. అప్పుడే వారి నుంచి కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి, అవి ఆవిష్కరణలుగా మారేందుకు అవకాశం ఉంది.
టీ హబ్‌పై మీ అభిప్రాయం…?
ఆనంద్ అరవింద్: ఏది కావాలన్నా అందించేలా ప్రభుత్వ పరంగా ఈ స్థాయిలో ఏర్పాటు చేయడ మంటే ఆశ్చర్యం వేసింది. దీన్ని కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- appreciates
- T hub
- Zenoti
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

