Biryani | బిర్యాని తిని యువతి మృతి.. మరో నలుగురు సీరియస్
Biryani | నిర్మల్‌లోని ఏఎన్‌రెడ్డి కాలనీలో గల గ్రిల్ నైన్ మల్టీ కుజైన్ రెస్టారెంట్లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన యువతి ఫూల్ ఖలీ బైగా(19) మంగళవారం మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్ రోడ్డులో గల సెయింట్ థామస్ స్కూల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ సిస్టర్ స్మిత,
Biryani | బోథ్, నవంబర్ 5: నిర్మల్‌లోని ఏఎన్‌రెడ్డి కాలనీలో గల గ్రిల్ నైన్ మల్టీ కుజైన్ రెస్టారెంట్లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన యువతి ఫూల్ ఖలీ బైగా(19) మంగళవారం మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్ రోడ్డులో గల సెయింట్ థామస్ స్కూల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ సిస్టర్ స్మిత, ఫాదర్ దీపక్, వైఎస్ ప్రిన్సిపాల్ సోఫీ, ఉపాధ్యాయురాలు సిజి, వంట మనిషి ఫూల్ ఖలీ బైగాలు ఈ నెల 2న నిర్మల్‌లోని గ్రిల్ నైన్ మల్టీ కుజైన్ రెస్టారెంట్లో చికెన్-65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు.

ఈ నెల 3న పాఠశాల యాజమాన్యం బోథ్‌లోని సీహెచ్‌సీలో చేర్పించింది. వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స అనంతరం వారిని ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈ నెల 5న మరోసారి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఫూల్ ఖలీ బైగా మంగళవారం మృతి చెందిం ది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కామారెడ్డికి తరలించారు. గ్రిల్ నైన్ మల్టీ కుజైన్ రెస్టారెంట్‌పై పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

