కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు!
కిడ్నీలో రాళ్లు తీయించుకోవడం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో చేరిన ఓ యువ న్యాయవాది ప్రాణమే పోయింది. మూత్రపిండంలో రాయిని తీస్తే మెదడులో రక్తస్రావమై చనిపోయిందని వైద్యులు చెప్పడంతో బంధువులు, తోటి అడ్వకేట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే యువతి చనిపోయిందని, హాస్పిటల్ ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. బంధువులు, న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం..
- రాయి తొలగిస్తే మెదడులో రక్తస్రావం
- మెడికవర్‌లో న్యాయవాది మృతి
- 7 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, అడ్వకేట్ల ఆందోళన
- ఘటనపై విచారణకు డిమాండ్
మారేడ్‌పల్లి, అక్టోబర్ 13: కిడ్నీలో రాళ్లు తీయించుకోవడం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో చేరిన ఓ యువ న్యాయవాది ప్రాణమే పోయింది. మూత్రపిండంలో రాయిని తీస్తే మెదడులో రక్తస్రావమై చనిపోయిందని వైద్యులు చెప్పడంతో బంధువులు, తోటి అడ్వకేట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే యువతి చనిపోయిందని, హాస్పిటల్ ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. బంధువులు, న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన సుధీర్‌కుమార్- గాయత్రీదేవి కూతురు ఐశ్వర్య (28) జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 40 రోజుల కిత్రమే పట్టాభి తో వివాహం జరిగింది. ఇటీవల కడుపులో నొప్పి రావడంతో వైద్యుల దగ్గర చూపించుకోగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు.
ఆపరేషన్ కోసం ఈ నెల 7న సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్లో చేరింది. అదే రోజున ఆమెకు శస్త్రచికిత్స చేశారు. 2 ఎంఎం సైజు రాళ్లు ఉన్న ఆమెకు అవసరం లేకున్నా ఆపరేషన్ చేశారని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అపస్మారక స్థితికి చేరుకున్నదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమెను బ్రెయిన్ డెడ్‌కు గురైందని చెప్తున్నారని హాస్పిటల్ ఎదుట ఆదోళనకు దిగారు. పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి సదరు డాక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని, హాస్పిటల్‌ను సీజ్ చేయాలని నినాదాలు చేశారు. ఐశ్వర్య చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.7 లక్షలు ఖర్చు చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గోపాలపురం, మార్కెట్, తుకారాం గేట్, హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి బంధువులకు నచ్చజెప్పారు.
హెల్త్ బులెటిన్‌లో ఏమున్నదంటే
ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ‘తీవ్ర కడుపునొప్పితో అక్టోబర్ 7న హాస్పిటల్లో చేరిన టీ ఐశ్వర్య (28)కు కిడ్నీ నుంచి మూత్రం ప్రవహించే మార్గంలో అడ్డంకిగా ఉన్న రాయిని ఆపరేషన్ ద్వారా తొలగించాం.. రక్తంలో ప్లేట్లెట్లు, తెల్ల రక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో శరీరంలో వాపు రావడంతో ఎంఐసీయూకు తరలించి చికిత్స అందించాం.. సీటీ స్కాన్‌లో మెదడులో రక్త స్రావమైనట్టు గుర్తించాం. ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మందులతో చికిత్స అందించాం’ అని పేర్కొన్నది.
రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్ ఉన్నడా?
కిడ్నీ స్టోన్ సర్జరీతోని వేరే ఆర్గాన్ కూడా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంటే మాకు ముందే చెప్పాలె. అది చెప్పకుండా రూ.9 లక్షలు ముందే కట్టించుకున్నరు. ముందే చెప్పిఉంటే మేము కిడ్నీ ఇస్తుంటిమి.. అమ్మాయి బతుకుతుండె.. అసలు కిడ్నీ స్టోన్ వస్తే మల్టీ ఆర్గాన్ డిజార్డర్ ఎట్లయితది? ఇదొక్కటే కాదు.. నెలలోజుల్లో ఈ హాస్పిటల్లో 9-10 మంది చనిపోయిండ్రు. అసలు రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఉన్నడా లేడా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? దీనిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అడ్వకేట్ల పరిస్థితే ఇట్లుంటే సామాన్యుల సంగతేంది? మెడికవర్ హాస్పిటల్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
బాడీ కమిలిపోతే బ్యాండేజీలు వేసిండ్రు
2 ఎంఎం కిడ్నీ స్టోన్‌కు మనిషి చనిపోతదా? తొందరతొందరగ మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని వెంటపడ్డరు. ఇంకా తొమ్మిది లక్షల బిల్లు ఉందట.. పేషెంట్ కండీషన్ ఎలా ఉన్నది అని అడిగితే మమ్మల్ని ఐసీయూలోకే రానివ్వలేదు. బాడీ మొత్తం బ్యాండేజీలు కట్టేసిండ్రు. అసలు ఏం ఆపరేషన్ చేసిండ్రు? ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రో రిపోర్ట్ పరిశీలిద్దామని అడిగితే వాళ్ల దగ్గర ప్రింటర్ లేదట.. అక్కడ ఫిజికల్ కాపీలు ఉండవట. ఆన్లైన్లో ఇస్తరట.. ఆన్లైన్లో ఇస్తే చదువురాని వాళ్లకు ఎలా తెలుస్తది? దీన్నిబట్టి తెలుసున్నది వీళ్లది ఎంత మోసమో.. ‘మీ పాప ఏమన్న 200 ఏండ్లు బతుకదా? అని డాక్టర్ ప్రదీప్ మిశ్రా అన్నడంట.. ఒక పేషెంట్ తండ్రి ని పట్టుకొని డాక్టర్ ఇట్ల అనొచ్చునా?
– ఐశ్వర్య సహచర న్యాయవాది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

