సోమాజిగూడ ‘యశోద’కు గిన్నిస్ రికార్డు
ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ)పై అతిపెద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా సోమాజిగూడలోని యశోద దవాఖాన ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఆన్లైన్ వేదికగా జరిగిన జరిగిన ఈ కార్యక్రమంలో ఒకేసారి 578 మంది పాల్గొనడంతో ఈ రికార్డు లభించింది.
ఖైరతాబాద్, జూలై 17 : ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ)పై అతిపెద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా సోమాజిగూడలోని యశోద దవాఖాన ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఆన్లైన్ వేదికగా జరిగిన జరిగిన ఈ కార్యక్రమంలో ఒకేసారి 578 మంది పాల్గొనడంతో ఈ రికార్డు లభించింది. ఐబీడీపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ఈ వ్యాధిని ముందే గుర్తించేలా చూడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు యశోద దవాఖాన యాజమాన్యం వెల్లడించింది. గిన్నిస్ బుక్ రికార్డ్స్ అఫీషియల్ అడ్జడికేటర్ రిషినాథ్ సమక్షంలో యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ సెంటర్ ఫర్ ఐబీడీ డైరెక్టర్, సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ పెద్ది, యూనిట్ హెడ్ డాక్టర్ ఎస్ ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఈ రికార్డును అందుకున్నారు.
అనంతరం దవాఖానలో ‘ఐబీడీ కాంక్లేవ్-2.0’ పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దేశ, విదేశాలకు నుంచి 300 మందికిపైగా ప్రతినిధులు, ముగ్గురు అంతర్జాతీయ అధ్యాపకులు, 50 మందికిపైగా జాతీయ నిపుణులు హాజరయ్యారు. ఐబీడీ చికిత్సలో తాజా పురోగతులు, బయోలాజిక్ థెరపీలు, ఇంటెస్టినల్ అల్ట్రాసౌండ్, కృత్రిమ మేథస్సు వినియోగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం డాక్టర్ కిరణ్ పెద్ది, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ప్రతి ఐబీడీ రోగికి ప్రపంచస్థాయి వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని, గిన్నిస్ రికార్డు లభించడం తమ వైద్య బృందం అంకితభావానికి నిదర్శమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

