హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక ‘న్యూస్ వీక్ అండ్ స్టా టిస్టా’ ఆధ్వర్యంలో ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్-2026 జాబితాలో తమ దవాఖానలకు ప్రముఖ స్థానం లభించిందని యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీందర్రావు వెల్లడించారు.
ఈ జాబితాలో తెలుగు రాష్ర్టాల నుంచి కేవలం 7 దవాఖానలు మాత్రమే చోటు దక్కించుకున్నాయని, వాటిలో సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్పేట యశోద దవాఖానలు ఉన్నాయని తెలిపారు. వరుసగా 8వ సంవత్సరం ఈ గుర్తింపును సాధించడం గర్వకారణంగా ఉన్నదని, యశోద గ్రూప్ హాస్పిటల్స్ అందించే ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలే ఈ గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు.