ఏసీబీ వలలో గుట్ట సబ్ రిజిస్ట్రార్

యాదాద్రి, జూలై29: ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకొంటూ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్, మధ్యవర్తి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని యాప్రాల్‌కు చెందిన డాక్టర్ సత్యం మడే 2008లో ఆలేరు మండలంలోని కొలనుపాకలో స్విస్లైప్ గ్రీన్ ఎవెన్యూ టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెంచర్ ఏర్పాటుచేసి ప్లాట్లు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 22న 5 ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా సబ్ రిజిస్ట్రార్ రూ.50 వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వపోవడంతో 2 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, 3 డాక్యూమెంట్లను పక్కన పెట్టాడు. దీంతో చేసేదిలేక బాధితుడు రూ.20వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం మధ్యవర్తి అయిన అసిస్టెంట్ డాక్యుమెంట్ ప్రభాకర్‌కు రూ.20 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభాకర్‌తోపాటు సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

