గురుకుల కళాశాలలో పురుగుల అన్నం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం తమకు వద్దంటూ విద్యార్థిను లు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
- మూడ్రోజులుగా ఇదే పరిస్థితి
- చెప్పినా పట్టించుకోని ప్రిన్సిపాల్
- తినకుండా నిరసన తెలిపిన 600మంది విద్యార్థినులు
భద్రాచలం, జూలై 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం తమకు వద్దంటూ విద్యార్థిను లు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. శనివారం ఉదయం సైతం అల్పాహారం కోసం చేసిన 80 కిలోల కిచిడీలో పురుగులు దర్శనమివ్వడంతో 600 మంది విద్యార్థినులు తినకుండానే కళాశాలలోని తరగతి గదులకు వెళ్లి నిరసన తెలిపారు. మూడ్రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని వాపోయారు. భద్రాచలం ఐటీడీఏ ప్రధాన కేంద్రానికి దగ్గరగా ఉన్న ఈ కళాశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తున్నది. గిరిజనులు కావడం వల్లే అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన సంఘాలు మండి పడుతున్నాయి. ప్రిన్సిపాల్ మాత్రం జీసీసీ నుంచి వచ్చిన బియ్యంలోనే పురుగులు రావడంతో ఆ బియ్యాన్ని వెనక్కి పంపినట్టు తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ పీవో బీ రాహుల్ విచారణకు ఆదేశించారు. పీఎంఆర్సీ ఆర్సీవోను విచారణ అధికారిగా నియమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

