తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు
తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నేషనల్ టూరిజం డేను పురసరించుకొని హైదరాబాద్‌లోని తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో టూరిజం అధికారులను గురువారం ఘనంగా సన్మానించారు.
- పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నేషనల్ టూరిజం డేను పురసరించుకొని హైదరాబాద్‌లోని తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంలో టూరిజం అధికారులను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు పర్యాటక రంగాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి పర్యాటక ప్రదేశాలను నిర్లక్ష్యం చేశారని వాపోయారు.
సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యునెసో గుర్తింపు లభించిందని అన్నారు. పోచంపల్లి గ్రామం వరల్డ్ బెస్ట్ టూరిజం విలెజ్‌గా ఎంపికైందని చెప్పారు. తెలంగాణలో బుద్ధిజానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టూరిజం అధికారులు ఓం ప్రకాశ్, మహేశ్, బుద్ధవనం అధికారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

