ప్రొఫెసర్లపై పోలీస్ జులుం.. మహిళా ప్రొఫెసర్లను ఈడ్చేసిన్రు
వీసీ జానయ్య లైంగిక వేధింపులకు నిరసనగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిరసన చేపట్టిన మహిళా ప్రొఫెసర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు ఈడ్చుకుపోయారు.
- తోపులాటలో ఒకరికి గాయాలు
- నిరసనకారులపై విరుచుకుపడిన వీసీ జానయ్య మద్దతుదారులు
వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 12 : వీసీ జానయ్య లైంగిక వేధింపులకు నిరసనగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిరసన చేపట్టిన మహిళా ప్రొఫెసర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు ఈడ్చుకుపోయారు. ఈ తోపులాటలో ప్రొఫెసర్ సౌజన్య చేతికి గాయాలయ్యాయి. మరికొందరికీ స్వల్పగాయాలయ్యాయి. వీసీ జానయ్య లైంగిక వేధింపులకు నిరసనగా విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న నిరసనలపై తొలుత పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాధితురాలైన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మద్దతుగా గత వారం రోజులుగా నిరసన కొనసాగుతున్నది.
గురువారం కూడా శాంతియుతంగా వచ్చి మహిళా ప్రొఫెసర్లు సహా పలువురు నిరసన తెలుపుతుండగా, వీసీ మద్దతుదారులు కొందరు ధర్నా చౌక్ వద్ద అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. మహిళల నిరసనను భగ్నం చేయడానికి బోధనేతర సిబ్బంది సంఘం నాయకులు శ్రీనివాస్‌యాదవ్, భిక్షపతి తదితరులు వచ్చి వ్యతిరేక నినాదాలు చేశారు. ఇరువర్గాల నినాదాలతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్థానిక పోలీసులు జోస్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించే పేరుతో అందరినీ అరెస్టు చేశారు. ఈ సమయంలో మహిళా ప్రొఫెసర్లపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు.
ఇష్టారీతిన ఈడ్చిపడేయంతో వారంతా తల్లడిల్లిపోయారు. ఈ సమయంలోనే సౌజన్య సహా కొందరికి గాయాలయ్యాయి. అనంతరం అరెస్టు చేసిన వీసీ వర్గం నాయకులను రాజేంద్రనగర్, మహిళలను, వారికి మద్దతు తెలిపిన వారిని కంచన్‌భాగ్ ఠాణాకు తరలించారు. పోలీసుల తోపులాటలో ప్రొఫెసర్ సౌజన్య చేతికి గాయాలయ్యాయి. టాసా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చల్లా సౌజన్య కార్యక్రమంలో టాసా అధ్యక్షుడు పవన్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు అమృత్‌రెడ్డి, డాక్టర్ సునీత, ప్రశాంత్, కమలాకర్, జయరాజ్, రమేశ్, త్రివేణి, పరమేశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు సత్యమూర్తి, రాజ్‌కుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కంచన్‌భాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

