ఉన్నత విద్యలో మహిళల హవా.. డిగ్రీ, పీజీ నమోదులో ఆధిపత్యం
భర్తను భార్య రోకలి బండతో మోది హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. గురువారం కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో మెట్పల్లి డీఎస్పీ రాములు వివరాలను వెల్లడించారు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట బేడబుగడజంగం కాలనీకి చెందిన ఇప్ప కాశీరామ్ (35)కు అదే కాలనీకి చెందిన సదుల రజనితో 14 ఏండ్ల క్రితం వివాహం జరిగింది.
- పురుషుల కంటే మహిళల నమోదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణకు మూడో స్థానం
- వెల్లడించిన ‘అయిషే 2023-24’ నివేదిక
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్నత విద్యలో మహిళల హవా నడుస్తున్నది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో వారిదే అధిపత్యం. ఏకంగా పురుషులను దాటి మహిళలు ముందంజలో నిలిచారు. పురుషుల ఎన్రోల్మెంట్ కంటే మహిళల నమోదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పురుషుల నమోదు నిష్పత్తి 44.2 శాతం ఉంటే, మహిళల నమోదు నిష్పత్తి 49.2 శాతంగా ఉన్నది. ఈ విషయాలను ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్(అయిషే) 2023-24 నివేదిక వెల్లడించింది. గత ఐదేండ్లలో రాష్ట్రంలో ఉన్నతవిద్య నమోదు నిష్పత్తి గణనీయంగా పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇక గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(స్థూల నమోదు నిష్పత్తి ) అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లోనూ తెలంగాణ చోటుదక్కించుకున్నది. ఈ విషయంలో తమిళనాడు మొదటిస్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఉన్నాయి. 44.6శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.
మరికొన్ని విషయాలు..
- సామాజికవర్గాల వారీగా తీసుకుంటే.. ఎస్సీల్లో పురుషుల నమోదు నిష్పత్తి 41శాతం ఉంటే, మహిళా నమోదు ఏకంగా 50.7 శాతంగా నమోదైంది. వందలో పది మంది మహిళలు పురుషులకంటే ఎక్కువగా ఉన్నత విద్యలో చేరుతున్నారు.
- ఎస్టీల్లో పురుషుల నమోదు నిష్పత్తి 46.5శాతం ఉంటే, మహిళల్లో 45.5 శాతం ఉన్నది. అంటే ఎస్టీ వర్గానికి చెందిన మహిళలు పురుషులతో పోటీపడటం లేదన్నమాట.
- లక్ష విద్యార్థులకు అత్యధిక కాలేజీలున్న రాష్ర్టాల్లో కర్ణాటక 69, తెలంగాణ 56 కాలేజీలతో మొదటి, రెండోస్థానంలో నిలిచాయి.
- దేశంలో అత్యధికంగా కాలేజీలున్న రాష్ర్టాల్లో టాప్-10 రాష్ర్టాల్లో 2,160 కాలేజీలతో తెలంగాణ 9వ స్థానంలో ఉన్నది.
- 2023లో రాష్ట్రంలో 39 కొత్త కాలేజీలను స్థాపించగా, వీటిలో ఎన్రోల్మెంట్ 3,351గా నమోదైంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

