సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్లు
సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి మార్గం సుగమమైంది. హెవీ మోటర్ వెహికల్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు.
- సంస్థ చరిత్రలో 13 మందికి అవకాశం
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి మార్గం సుగమమైంది. హెవీ మోటర్ వెహికల్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 13 మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు. ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుంచి సర్ఫేస్కు తరలించేందుకు 60 నుంచి 100 టన్నుల కెపాసిటీ కలిగిన భారీ డంపర్లను వినియోగిస్తున్నారు. అయితే 50 ఏండ్లుగా పురుషులు మాత్రమే ఈ డంపర్లను ఆపరేట్ చేస్తున్నారు.
సర్కార్ సూచనల మేరకు మహిళలను కూడా నియమించాలని సింగరేణి నిర్ణయించింది. ఇందుకు దరఖాస్తులు స్వీకరించి, అర్హత, ఆసక్తి కలిగిన 13 మందిని ఎంపిక చేశారు. వీరికి సిరిసిల్లలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్(టైడ్స్)లో ట్రైనింగ్ ఇచ్చారు. త్వరలోనే వీరిని విధుల్లోకి తీసుకోనున్నట్టు సింగరేణి అధికారులు గురువారం వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

