హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ శనివారమే ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.. తాజాగా ఏ4 లిక్కర్ షాప్ (వైన్స్)లకు రిజర్వేషన్ల ప్రకారం లాటరీతీసే బాధ్యతను కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, ట్రైబల్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ డెవలప్మెంట్ అధికారులకు అప్పగించింది. ట్రైబల్ ఏరియాల్లోని షాపులను ఎస్టీలకు మాత్రమే కేటాయిస్తామని, ఇందుకోసం అన్ని షాపులతో కలిపి కాకుండా ప్రత్యేకంగా లాటరీ తీస్తామని పేర్కొన్నది. గిరిజనేతర ప్రాంతా ల్లో ఎస్టీలకు పరిమిత సంఖ్యలోనే షాపులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. లాటరీతీసే సమయంలో తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని సూచించింది.
లాటరీ తీసేది ఇలా..