నా జన్మదిన వేడుకలకు హైదరాబాద్‌కు రావొద్దు.. కేటీఆర్ విజ్ఞప్తి
కేటీఆర్ | తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణులకు,

హైదరాబాద్ : తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, రేపు తాను ఎవరిని కలవడం లేదని కేటీఆర్ తెలిపారు. తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం చేస్తూ.. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత బైక్‌ల పంపిణీ
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాల కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు మంత్రి కేటీఆర్‌కు వస్తున్నాయని వాటన్నింటిని తమ కార్యాలయం క్రోడీకరించి, ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందజేస్తామని అని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

