Hanmanth Naik | గురుకుల ఏడీపై వేటు వెనుక మర్మమేంటి?.. బదిలీలు, పదోన్నతుల్లో గోల్మాలే కారణమా..!
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ సొసైటీ అడిషనల్ సెక్రటరీ హన్మంత్నాయక్ను ప్రభుత్వం ఉన్నపళంగా తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవంగా ఎస్సీ అభివృద్ధిశాఖ హన్మంత్‌నాయక్ పేరెంటల్ డిపార్ట్మెంట్ కాగా, ఎస్సీ గురుకుల సొసైటీలో అడిషనల్ సెక్రటరీగా విధులను నిర్వర్తిస్తున్నారు.
Hanmanth Naik | హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ సొసైటీ అడిషనల్ సెక్రటరీ హన్మంత్నాయక్ను ప్రభుత్వం ఉన్నపళంగా తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవంగా ఎస్సీ అభివృద్ధిశాఖ హన్మంత్‌నాయక్ పేరెంటల్ డిపార్ట్మెంట్ కాగా, ఎస్సీ గురుకుల సొసైటీలో అడిషనల్ సెక్రటరీగా విధులను నిర్వర్తిస్తున్నారు. సొసైటీ కీలక విభాగాలన్నీ ఆయన పర్యవేక్షణ కిందనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగిన బదిలీలు, పదోన్నతులు అనేక వివాదాలకు తెరలేపింది. సొసైటీ టీచర్లు ఏకంగా ప్రజాభవన్ వద్దకు వెళ్లి ధర్నాలకు దిగారు.
సొసైటీ ఉద్యోగులే కాదు ఏడీ హన్మంతనాయక్పై మాదిగ, మాల, లంబాడ వర్గాలకు చెందిన పలు సంఘాల నేతలు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారని తెలుస్తున్నది. సొసైటీలోని కొందరు ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హన్మంతునాయక్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై ఏసీబీ కేసు పెట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఆ ఫిర్యాదులను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని లోతుగా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉన్నపళంగా వేటు వేసి, పోస్టింగ్ ఇవ్వలేదని సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

