గ్రూప్ పోస్టుల పెంపు ఏమైంది?
నిరుద్యోగుల అసలు డిమాండ్లను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ధ్వజమెత్తారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదాతోపాటు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన ఇతర హామీల సంగతేందని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
- బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19: నిరుద్యోగుల అసలు డిమాండ్లను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ధ్వజమెత్తారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదాతోపాటు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన ఇతర హామీల సంగతేందని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా నిరుద్యోగులు అనేక అంశాలపై పోరాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. గ్రూప్ 2లో రెండు వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టుల పెంపు ఏమైందని పేర్కొన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు వేయలేదని, జాబ్ క్యాలెండర్‌ను ఎందుకు విడుదల చేయలేదని, నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

