ట్రిపుల్ ఆర్ ప్రస్తావనేది?
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణకు మాత్రం అన్ని రంగాల్లోనూ నిరాశనే మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రస్తావన బడ్జెట్లో లేకుండా పోయింది.
- బడ్జెట్లో ఊసేలేని రాష్ట్ర రోడ్లు
- టెండర్ల ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యేనో?
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణకు మాత్రం అన్ని రంగాల్లోనూ నిరాశనే మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రస్తావన బడ్జెట్లో లేకుండా పోయింది. సుమారు రూ.30 వేల కోట్లకుపైగా ఖర్చవుతున్న ఈ ప్రాజెక్టు ఉత్తర భాగం భూసేకరణ చివరిదశకు చేరుకోగా త్వరలో టెండర్ల ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. ట్రిపుల్ ఆర్ మొత్తం 346 కిలోమీటర్ల పొడవు కాగా, దీన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి పనులు చేపడుతున్న విషయం విదితమే.
జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఈ రోడ్డును నిర్మిస్తుండగా, భూసేకరణ వ్యయంలో సగభాగం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. భారత్మాల ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఉత్తరభాగం 164 కిలోమీటర్లకు 90 శాతం వరకు భూసేకరణ పూర్తయింది. దీనికి టెండర్లు పిలిచి పనులు చేపట్టాల్సి ఉంది. కాగా, వికసిత్ భారత్ ప్రాజెక్టులో చేపట్టనున్న దక్షిణ భాగం 182 కిలోమీటర్లకు కూడా ఇదివరకే కేంద్రం ఆమోదం తెలిపింది. అలైన్మెంట్ ఖరారైతే ఈ భాగానికి కూడా భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. భూసేకరణను వ్యతిరేకిస్తూ కొన్నిచోట్ల రైతులు ఆందోళన చేయడం, కోర్టులో కేసులు వేయడంతో భూసేకరణ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారం చెల్లింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జాతీయ రహదారుల అథారిటీ చైర్మన్కు విజ్ఞప్తిచేశారు. కానీ బడ్జెట్లో ట్రిపుల్ ఆర్ ఊసే లేకుండాపోయింది. ట్రిపుల్ ఆర్ పనులకు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావిస్తారని అందరూ ఆశించినప్పటికీ కేంద్రం వారిని నిరాశకు గురిచేసింది. దీంతో ట్రిపుల్ ఆర్ భూసేకరణ ఎప్పటికి పూర్తవుతుందో, టెండర్ల ప్రక్రియ ఎప్పడు మొదలవుతుందో అనేది అంతుబట్టకుండా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

