హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదైనట్టు తెలిపింది. అత్యంత తక్కువగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 13.2 డిగ్రీలు నమోదైంది.