ఆవిరి మంచిదే

- వాసన కోల్పోయిన వారిలో కరోనా తీవ్రత తక్కువే
- ముక్కు, నోరే కాదు కండ్ల ద్వారా కూడా వైరస్
జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా? ఆవిరి పడితే వైరస్ లోపలికి వెళ్తుందంట కదా, నిజమేనా? కండ్ల ద్వారా వైరస్ సోకుతుందా? తదితర అనుమానాలను కోఠి ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టీ శంకర్ నివృత్తి చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధానాలను ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టీ శంకర్ ఆవిరి పట్టడం మంచిది కాదని ప్రచారం జరుగుతుంది. నిజమా?
జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నపుడు పసుపు,ఆకుపచ్చని ట్యాబ్లెట్లతో ఆవిరి పట్టడం మంచిదే. ఆవిరి వల్ల ముక్కులో, గొంతులో, శ్వాస నాళాల్లో చేరిన వైరస్లు ఏవైనా అంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నా ఆవిరి పట్టడం మంచిదే.
వాసన కోల్పోతే వ్యాధి తీవ్రత ఎంత ఉంటుంది?
కరోనా సోకిన వారిలో మొదట జ్వరం, ముక్కు, గొంతుకు సంబంధించి లక్షణాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటివి కనిపిస్తాయి. 4, 5 రోజుల తర్వాత వాసన తెలియకపోవటాన్ని చాలామందిలో గుర్తిస్తున్నారు. కరోనా సోకిన వారం తర్వాత వాసన సాధారణ స్థితికి వస్తుంది. వాసన పోయిందని చెప్తున్నవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. గొంతులో నొప్పి, గొంతు గరగర, ఇతర వ్యాధి లక్షణాలున్నట్టు అనిపిస్తే టెస్ట్‌ల కోసం పరుగెత్తకుండా వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు టెస్ట్‌లు చేయించుకోవాలి. మందులు వాడాలి. శ్వాస తీసుకోవటంలో తేడాలుంటే మాత్రం దవాఖానలో చేరాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మీరిచ్చే సూచన ఏంటి?
భయం మనిషిని కుంగదీస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి బయట పడేందుకు జాగ్రత్తలతో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. భౌతికదూరం పాటిస్తూ, మాస్కు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తప్పనిసరి చేయించుకోవాలి.
హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- Covid-19
- steam
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

