వనపర్తి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వార్డెన్ లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, బంధువులు బుధవారం పాఠశాలకు వెళ్లి ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేసి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పాఠశాల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, డీఈవోను కలిసి వినతిపత్రం ఇచ్చారు.