విలాసాలకు పోయి..భిక్షగాడిగా మారి

- మోసగాడి అవతారమెత్తిన అధ్యాపకుడు
- 40కి పైగా నాన్‌బెయిలబుల్ వారెంట్లు
- తప్పించుకునేందుకు 13 ఏండ్లు అజ్ఞాతం
- ఎట్టకేటలకు పట్టుకొన్న కరీంనగర్ పోలీసులు
కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇంజినీరింగ్ చదివి లెక్చరర్‌గా పనిచేసినవ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం తప్పటడుగులు వేశాడు. నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టిస్తూ 13ఏండ్ల్లుగా అజ్ఞాతంలో ఉన్న అతడ్ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. కామారెడ్డిలోని ఎన్జీవో కాలనీకి చెందిన కుందన శ్రీనివాసరావు అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శశాంకరావు తండ్రి టెలికాం డిపార్ట్మెంట్లో ఉన్నతోద్యోగి. 1991లో ఇంజినీరింగ్ పూర్తిచేసి.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో 2006 వరకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అధ్యాపకుడిగా పనిచేశాడు. చాలీచాలని జీతంతో తన కోరికలు తీరడం లేదని మోసాలకు తెరలేపాడు. కొందరితో కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ కిసాన్ వికాసపత్రాలు సృష్టిం చి బ్యాంకుల నుంచి కోటికిపైగా రుణాలు తీసుకొన్నాడు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, గుంటూరు తదితర జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయన 2007లో ఏడాదిపాటు కరీంనగర్ జైలులో ఉన్నాడు. 2008లో జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లాడు.
భిక్షగాడిగా అవతారమెత్తి..
పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు శ్రీనివాస్‌రావు కొత్త అవతారాలు ఎత్తాడు. కూర శశాంకరావు పేరుతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామాలు మారుస్తూ హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు కాలేజీల్లో మూడేండ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశాడు. అక్కడినుంచి వరంగల్‌కు మకాం మార్చి కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత కుటుంబం లో తలెత్తిన వివాదంతో అతని భార్య వెళ్లిపోగా, తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకొని విజయవాడ వెళ్లాడు. అక్కడ హోటల్లో కొంతకాలం పనిచేసి తర్వాత తిరుపతికి వెళ్లిపోయాడు. తిరుపతిలో ఓ రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో జీవనం దుర్భరంగా మారింది. మానసికంగా, ఆర్థికంగా చితికిపోయిన గత్యంతరం లేక భిక్షాటన మొదలుపెట్టాడు. శ్రీనివాస్ కనిపించట్లేదని అతని సోదరుడు శ్రీధర్ 2018లో వరంగల్, నిజామాబాద్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెల్లిన నిజామాబాద్ వాసులు అక్కడ భిక్షాటన చేస్తున్న శ్రీనివాస్‌ను గుర్తించి శ్రీధర్‌కు సమచారం ఇచ్చారు. దీంతో అతడు తన సోదరుడ్ని బెంగళూరుకు తీసుకెళ్లి ఒక ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు. వివిధ కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్న నిందితులను పట్టుకొనేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి ‘ఆపరేషన్ తలాశ్’కు రూపకల్పన చేశారు. 40 వారంట్లున్న శ్రీనివాస్‌ను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ బృందం బెంగళూరులో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

