VTGCET-2023 దరఖాస్తు గడువు పొడిగిస్తూ తెలంగాణ గురుకులాల( Telangana Residentials ) సంస్థ నిర్ణయం తీసుకుంది. ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే VTGCET-2023కు ఈ నెల 16వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ టీఎస్డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్, టీఆర్ఈఐ గురుకులాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. తదితర వివరాల కోసం www.tswreis.ac.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.