న్యాక్‌కు విశ్వకర్మ అవార్డు
నైపుణ్యాభివృద్ధి రంగానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మ విశ్వకర్మ అచీవ్మెంట్ అవార్డును నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కైవసం చేసుకున్నది. న్యూఢిల్లీలోని ఐకార్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చేతుల మీదుగా న్యాక్ డైరెక్టర్లు ఈ అవార్డును అందుకున్నారు.
- మంత్రి వేముల హర్షం
- న్యాక్ డైరెక్టర్లకు ప్రత్యేక అభినందనలు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): నైపుణ్యాభివృద్ధి రంగానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మ విశ్వకర్మ అచీవ్మెంట్ అవార్డును నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కైవసం చేసుకున్నది. న్యూఢిల్లీలోని ఐకార్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చేతుల మీదుగా న్యాక్ డైరెక్టర్లు ఈ అవార్డును అందుకున్నారు. దీనిపై న్యాక్ వైస్‌చైర్మన్, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
నిరుడు న్యాక్ 21,240 మంది యువతకు నిర్మాణ సంబంధ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిందని, వారిలో చాలా మంది ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఈ అవార్డు లభించిందని వివరించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును అందుకున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ న్యాక్ ఒక్కటేనని తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన న్యాక్ డీజీ భిక్షపతి, డైరెక్టర్లు రాజిరెడ్డి, డైరెక్టర్ శాంతి, హేమలత, సత్యపాల్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

