బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువ : వినోద్‌కుమార్
హైదరాబాద్ : బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, అధిక విద్యుత్ చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం కనీస సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, నవ్వి పొదురు గాక నాకేమీ సిగ్గు.. అన్నట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకుల పరిస్థితి ఉందని వినోద్ కుమార్ విమర్శించారు.
కనీసం వాస్తవాలను కూడా తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర నాయకులు పాదయాత్రలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తిమ్మిని బమ్మి చేయడమే మా తెలివి తేటలు అనే రీతిలో బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు. కనీసం పాదయాత్రలో అయినా వాస్తవాలు మాట్లాడాలని ఆయన బీజేపీ రాష్ట్ర నాయకులకు సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువ ఉండగా, కేవలం 7 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా ఉందని, అదే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తక్కువ, 24 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా సాగుతోందని వినోద్ కుమార్ తెలిపారు.
వ్యవసాయానికి రైతులకు 24 గంటల ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ ఒక్కటే అని స్పష్టం చేశారు. పరిశ్రమలకు కూడా ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ టారిఫ్‌లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు సాధ్యమయ్యాయని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని జీర్ణించుకోలేని బీజేపీ రాష్ట్ర నాయకులు తప్పుడు ప్రచారానికి నడుం బిగించారని ఆయన విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర నాయకులులారా..! వాస్తవాలను గ్రహించండి.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి.. అని వినోద్ కుమార్ హితవు పలికారు. బీజేపీ పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా వసూళ్లు చేస్తున్న విద్యుత్ చార్జీల టారిఫ్, తెలంగాణ రాష్ట్రంలో తక్కువ స్థాయిలో ఉన్న విద్యుత్ చార్జీల టారిఫ్ వివరాలను వెల్లడించారు. వంద యూనిట్లకు తెలంగాణలో రూ.3.49 వసూలు చేస్తుంటే.. కర్నాటకలో రూ.7.39, గుజరాత్లో రూ.6.35, యూపీ రూ.4.20, రాజస్థాన్‌లో రూ.8.49, ఛత్తీస్‌గఢ్‌లో రూ.4.32 ఉందని తెలిపారు. 200 యూనిట్లకు తెలంగాణలో రూ.4.76గా ఉందని, కర్నాటకలో రూ.8.07, గుజరాత్లో రూ.6.83, ఉత్తరప్రదేశ్‌లో రూ.7.64, రాజస్థాన్‌లో రూ.8.21, ఛత్తీస్‌గఢ్‌లో రూ.4.32గా ఉందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

