హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకుడి దేవస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు అదే రోజు దేవస్థానంలో వినాయక చవితి జరుపుతామని పేర్కొన్నది. 18, 19 తేదీల్లో చవితి ఉండటంతో అందరూ సందిగ్ధంలో పడిపోయారు. 18న సోమవారమే వినాయక చవితి జరుపుకోవాలని ఆగమ పండితులు సూచిస్తున్నారు. చతుర్థి మొదలైన రోజే వినాయక చతుర్థి జరుపుకోవాలని గ్రంథాలూ చెబుతున్నాయి. 2000, 2009, 2010, 2019లో ఇటువంటి సందిగ్ధతే ఏర్పడింది. అప్పుడు తదియతో ఉన్న చతుర్థినే పర్వదినంగా జరుపుకున్నారనే విషయాన్ని పండితులు తెలియజేస్తున్నారు.