అనంత పద్మనాభుని మొసలి మృతి
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ పరిసర సరస్సులో దాదాపు ఏడు దశాబ్దాలుగా నివసిస్తున్న శాకాహార మొసలి మృతిచెందింది. ఇది ఆలయంలో పెట్టే ప్రసాదం మాత్రమే తినేది. అప్పుడప్పుడు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనూ తిరుగుతూ కనిపించేది.
కాసర్గోడ్, అక్టోబర్ 10: కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ పరిసర సరస్సులో దాదాపు ఏడు దశాబ్దాలుగా నివసిస్తున్న శాకాహార మొసలి మృతిచెందింది. ఇది ఆలయంలో పెట్టే ప్రసాదం మాత్రమే తినేది. అప్పుడప్పుడు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనూ తిరుగుతూ కనిపించేది. తాము బాబియాగా పిలుచుకునే మొసలి శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిందని, ఆదివారం రాత్రి దాని మృతదేహం నీళ్లపై తేలుతూ కనిపించిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మొసలి చివరి దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో మృతదేహాన్ని సరస్సు నుంచి తొలగించి, సందర్శనార్థం ఉంచారు. అనంతరం మొసలికి అంత్యక్రియలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

