ఇంకెంత కాలం మభ్యపెడతరు?
స్సీ వర్గీకరణపై రేపు మాపు అంటూ పదేండ్లు కాలం గడిపి ఇంకా పార్లమెంటులో బిల్లు పెట్టకుండా ఇంకెంతకాలం మభ్యపెడతారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
- ఎస్సీ వర్గీకరణపై కేంద్రాన్ని నిలదీసిన వంగపల్లి
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై రేపు మాపు అంటూ పదేండ్లు కాలం గడిపి ఇంకా పార్లమెంటులో బిల్లు పెట్టకుండా ఇంకెంతకాలం మభ్యపెడతారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చి 11 ఏండ్లు అవుతున్నా ఆ అంశాన్ని ప్రస్తావించడమే లేదని మండిపడ్డారు. నిన్నటి కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకు మొండి చేయిచూపారని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోతే బీజేపీ నేతలతోపాటు మాదిగ సామాజికవర్గంలోని ఇంటి దొంగలను బట్టలిప్పి బజారున నిలబెడతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై తాడో పేడో తేల్చుకోవడానికి ఆగస్టు 6న ఢిల్లీలో దీక్ష చేయనున్నట్టు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోరుకునే సంస్థలు, సంఘాలు, మద్దతు ఇచ్చే పార్టీలు తమ దీక్షకు సంఘీభావం తెలుపాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేత యాతాకుల భాసర్ మాదిగ, కోర్ కమిటీ సభ్యులు చిలకమరి గణేశ్, పొట్టపెంజర రమేశ్, బంగారు శ్రీనివాస్, డప్పు శివరాజ్, నకిరేకంటి అంజన్న, కొండ లక్ష్మమ్మ, ఈదునురి యాకయ్య, కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, కే అంజన్న, ధర్మరపు శ్రీకాంత్, ఎల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

