Green Buildings | నిర్మాణ రంగంలో హరిత విప్లవం.. ఆరోగ్యం, ఆహ్లాదానికి నగర జీవుల ప్రాధాన్యం
కాంక్రీట్ జంగిల్లా మారిన గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు ఇప్పుడు హరిత భవనాల వైపు చూస్తున్నారు.
- వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్‌తో భారీ భవన నిర్మాణాలు
Green Buildings | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ): కాంక్రీట్ జంగిల్లా మారిన గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు ఇప్పుడు హరిత భవనాల వైపు చూస్తున్నారు. ఆరోగ్యంతోపాటు ఆహ్లాదానికి పెద్దపీట వేస్తూ హరిత భవనాల్లో కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటివారిని వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్‌లు బాగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు బిల్డర్లు సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్తోపాటు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కిస్మత్ఫుర, తెల్లాపూర్, కోకాపేట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్ నిర్మాణాలకు రియల్టర్లు శ్రీకారం చుట్టారు. తాజాగా కొండాపూర్‌లో ‘360 లైఫ్’ పేరిట ఓ బిల్డర్ వర్టికల్ గార్డెన్ కాన్సెప్ట్‌తో 19 అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నారు.
పర్యావరణాన్ని సమతుల్యం చేయడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం, గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించడం సవాల్‌గా మారిన ప్రస్తుత తరుణంలో అటవీ ప్రాంతాన్ని తలపించేలా భవన నిర్మాణాలు జరగడం శుభపరిణామమని పర్యావరణ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడటంతోపాటు ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే వర్టికల్ గార్డెన్ నిర్మాణాలకు మున్ముందు మరింత ఆదరణ లభిస్తుందని రియల్టర్లు చెప్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం హరిత భవనాలకు ప్రాధాన్యమిస్తుండటంతో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో ఇప్పటికే దాదాపు 25 ప్రాజెక్టులు నమోదయ్యాయి.
గ్రీన్ బిల్డింగ్స్‌తో లాభాలు
పర్యావరణ పరిరక్షణకు, జీవన ప్రమాణాల పెంపునకు గ్రీన్ బిల్డింగ్స్ ఎంతో దోహదపడతాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పచ్చదనంతో మానసిక, శారీరక సమస్యలు దరిచేరవు. మొక్కల నుంచి వెలువడే ఆక్సిజన్‌తో వాయు నాణ్యత పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతి లభిస్తాయి. విండ్ ఎనర్జీ, సోలార్ పవర్, వాటర్ హార్వెస్టింగ్తో విద్యుత్తు, నీటి బిల్లులు తగ్గుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

