Bandi Sanjay | గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ హామీలు నెరవేరడం అంతే నిజం.. బండి సంజయ్ ఎద్దేవా
Bandi Sanjay | గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూడా అంతే నిజమనేదానికి ఇవాల్టి బడ్జెట్ నిదర్శనమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? .. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని ప్రశ్నించారు.
Bandi Sanjay | గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూడా అంతే నిజమనేదానికి ఇవాల్టి బడ్జెట్ నిదర్శనమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? .. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క చదివింది ఆర్థిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా అని విమర్శించారు. అప్పులు ఉన్నందున హామీలు అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పులు ఉన్నాయన్న విషయం ముందే తెలిసి కూడా ఆరు గ్యారంటీలు ఎందుకు ఇచ్చారని అడిగారు. ఇప్పుడు వాటికి బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బద్నాం చేయాలని అనుకుంటున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో బడ్జెట్లో లెక్కా పత్రం చూపించకపోవడం విడ్డూరమని విమర్శించారు. సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
రుణ మాఫీ వల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుందని బండి సంజయ్ అన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుంచి తొలగిస్తారా? లేదా? చెప్పాలని నిలదీశారు. ఏడాదిపాటు నష్టపోయిన రైతు భరోసా, రూ.500 పంట బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే.. 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణమని అన్నారు. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం విడ్డూరం
అని అన్నారు.
బడ్జెట్లోని చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు.. మీరిచ్చిన అలవి కాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్లోనే తేలిందన్నారు. బడ్జెట్లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదని.. సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని… రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గ ప్రస్తావన చేయలేదు కదా.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బడ్జెట్లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా? అని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

