గ్రూప్-1 జీఆర్ఎల్ ఇవ్వకపోతే ఆమరణ దీక్ష
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్) విడుదల చేయకపోతే 500 మందితో ఆమరణ దీక్షకు దిగుతామని నిరుద్యోగ జేఏసీ నేత కోడంగల్ రవి హెచ్చరించారు. గ్రూప్-1 రిజల్ట్స్‌పై అనుమానాలున్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- నిరుద్యోగ జేఏసీ నేత కోడంగల్ రవి హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్) విడుదల చేయకపోతే 500 మందితో ఆమరణ దీక్షకు దిగుతామని నిరుద్యోగ జేఏసీ నేత కోడంగల్ రవి హెచ్చరించారు. గ్రూప్-1 రిజల్ట్స్‌పై అనుమానాలున్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ఉద్యోగాల తుది ఫలితాలు విడుదలైనా, ప్రాథమిక సమాచారాన్ని గోప్యంగా ఉంచడంపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. ఈమేరకు శుక్రవారం టీఎస్పీఎస్సీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రిలిమ్స్, మెయిన్స్, రాత పరీక్షలకు సంబంధించిన కటాఫ్ మార్కులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడంతో 1:50 నిష్పత్తి ఎంపికపై అనేక అనుమానాలు వ్యక్తంచేశారు. సమగ్ర వివరాలతో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ప్రచురించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

