TS Council | నగర శివార్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..! : మంత్రి కేటీఆర్
TS Council | భవిష్యత్ అవసరాలు, నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టాం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యను ఎలా తీర్చామో

హైదరాబాద్ : భవిష్యత్ అవసరాలు, నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టాం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యను ఎలా తీర్చామో… అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
నగరంలో వరద సమస్యను నివారించేందుకే వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇటీవల ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తిస్తామన్నారు. సమగ్ర విచారణ చేపట్టి… నాలా గ్రిడ్ మెరుగుదల కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము అని కేటీఆర్ వెల్లడించారు.
మొత్తం ప్రధాన కాలువలను 173 కిలోమీటర్లుగా మదింపు చేసి మొదటి దశ కింద జాబితాను ఖరారు చేశాం అని కేటీఆర్ తెలిపారు. 2021లోనే వర్షాకాలం రాకముందే ఈ పనిని చేపట్టి వరదనీటి డ్రైనేజీ నెట్వర్క్లో కనీసం 30 శాతాన్ని పూర్తి చేయాలనుకున్నాం. జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి.. కిర్లోస్కర్, వోయన్ట్స్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ… ఎస్ఈపీఈ ఇన్ఫ్రా కన్సల్టెన్సీని సంప్రదించి.. జీహెచ్ఎంసీ జాబితాకి ప్రాధాన్యత ఇచ్చాము అని కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

