యూకే ఫ్యూచర్ ఎంపీగా తెలంగాణ వ్యక్తి!

- లేబర్ పార్టీ తరఫున ఎంపికైన ఉదయ్ నాగరాజు
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు చెందిన వ్యక్తి యునైటెడ్ కింగ్డమ్ (యూకే ) పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరుఫున పోటీ చేయడానికి ప్రాథమిక అభ్యర్థుల జాబితాలో ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు ప్రాథమిక దశలో ఎంపికయ్యారు. నాగరాజు ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. యూకేలో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఎంపికపై అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీని కోసం ఫ్యూచర్ క్యాండిట్స్ పేరుతో రెండు సంవత్సరాల ముందు నుంచే వివిధ రకాల వడపోతల ద్వారా ఎంపిక చేస్తారు. ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన విద్య, సేవా గుణం, సామాజిక సేవ చేసిన వివరాలు, ప్రజా సమస్యలపై స్పందించే గుణం, వాటిపై అవగాహన ఇలా అనేక ఇతర అంశాలపై పోటీ పరీక్షలు నిర్వహించి వారిని ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వారిలో నాగరాజు ఉన్నారు. ఇలా ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన మొదటి వ్యక్తిగా నాగరాజు నిలిచారు. గతంలో యూకేలో ఎంపీలుగా గెలిచిన వారిలో తెలంగాణ సంతతికి చెందిన వారు ఉన్నారు తప్ప… తెలంగాణకు చెందిన వారు లేరు. యూకే లేబర్ పార్టీ అధ్యక్షుడు కిర్ స్టార్మర్ నాయకత్వంలో నాగరాజు ఎన్నికలను ఎదుర్కోనున్నారు. వరంగల్లో పాఠశాల విద్యను అభ్యసించిన నాగరాజు మహారాష్ట్ర రాంటెక్లోని కిట్స్ కాలేజీలో ఎంటెక్ పూర్తి చేశారు. లండన్లో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ బ్రూక్స్లో ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పరిపాలన శాస్త్రంలో పీజీ చేస్తున్నారు. నాగరాజు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుల సమీపబంధువు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

