Asifabad | అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల కోసం వాదులాట.. విద్యార్థుల ఎదుటే టీచర్ల బూతు పురాణం
అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధుల విషయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గొడవపడ్డారు. విద్యార్థుల ఎదుటే బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకొట్టుకునే స్థాయికి వెళ్లారు.
- పాఠశాలకు తాళం వేసిన గ్రామస్థులు
- నేడు గ్రామస్థుల సమక్షంలో విచారణ
Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధుల విషయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గొడవపడ్డారు. విద్యార్థుల ఎదుటే బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీనికి సంబంధించి గ్రామస్థులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం సాలెగూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ పథకం కింద ఎంపికైంది.
ఇందుకోసం రూ.7.25 లక్షలు మంజూరయ్యాయి. హెచ్ఎం ఆనంద్‌రావు 20 రోజులుగా అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నాడు. మరో ఉపాధ్యాయుడు తిరుపతికి ఇన్చార్జి హెచ్ఎంగా బాధ్యతలు అప్పగించారు. సోమవారం హెచ్ఎం ఆనంద్‌రావు పాఠశాలకు వచ్చాడు. అమ్మ ఆదర్శ నిధుల విషయంలో హెచ్ఎం ఆనందరావు, ఇన్చార్జి హెచ్ఎం తిరుపతికి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. బూతులు తిడుతూ చెప్పులు చూపిస్తూ, రాళ్లతో దాడికి ఆనంద్‌రావు ప్రయత్నించాడు. విషయం తెలుసుకుని గ్రామస్థులు అక్కడికి వచ్చి గొడవను ఆపారు. పాఠశాలకు తాళం వేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
హెచ్ఎం ఆనందర్‌రావు ఇష్టానుసారంగా పనులు చేపట్టాడని, పాఠశాల మరమ్మతుల కోసం తెచ్చిన సామగ్రిని తమ ముందే ఆటోలో తరలించుకుపోయాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిధుల వాటా అందకపోవడంతో హెచ్ఎం ఆనంద్‌రావు గొడవకు దిగాడని పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎంఈవో మనుకుమార్ను వివరణ కోరగా.. మంగళవారం గ్రామస్థుల సమక్షంలో విచారణ చేపడుతామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

