Mahabubabad | ఇద్దరు వివాహితల సహజీవనం.. ఆరునెలల క్రితం భర్తలను వదిలి ఒక్కటయ్యారు?
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడేనికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు గ్రామం నుంచి పరారై ఒక్కటయ్యారనే వార్త దావానలంలా వ్యాపించింది.
- గ్రామ పెద్దలు చెప్పిన ససేమిరా
- సోషల్ మీడియాలో వైరల్
Mahabubabad | కొత్తగూడ, జూన్ 7 : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని ఓ గిరిజన గూడేనికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు గ్రామం నుంచి పరారై ఒక్కటయ్యారనే వార్త దావానలంలా వ్యాపించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గిరిజన గూడేనికి చెందిన ఇద్దరు వివాహితలు గ్రామం నుంచి పరారయ్యారు.
వారిలో ఒక మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళకు భర్త, కొడుకు ఉండగా, ఇటీవల అనారోగ్యంతో కొడుకు మృతిచెందాడు. కాగా, వీరిద్దరూ ఆరునెలల క్రితం గ్రామం నుంచి పరారై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల ప్రాంతంలో రహస్యంగా జీవిస్తున్నారు.
ఒకరు పురుషుడిలా, మరొకరు మహిళలా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి భర్త భార్య కోసం వెతుక్కుంటూ వారు ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. ఐదు రోజుల క్రితం వారిని గ్రామానికి తీసుకొచ్చి స్థానికుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా, వారు పెద్దమనుషుల మాటను లెక్క చేయకుండా తమకు నచ్చిన విధంగా ఉంటామని చెబుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో గ్రామ పెద్దలు ఉన్నారు. ప్రస్తుతానికి సదరు మహిళలు అదే గ్రామంలోని తమ తల్లిగారి ఇండ్లల్లో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

