దేవరకద్రలో గాలివాన బీభత్సం.. గోడ కూలి ఇద్దరు దుర్మరణం
గాలివాన బీభత్సానికి నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి కారుపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకద్రలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
కౌకుంట్ల(దేవరకద్ర), జూన్ 17: గాలివాన బీభత్సానికి నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి కారుపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకద్రలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చాలాచోట్ల చెట్టుకొమ్మలు, కరెంట్ స్తంభాలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఎస్బీఐ బ్యాంకు సమీపంలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం గోడ కూలి పక్కన ఉన్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతికష్టం మీద వారిని బయటకు తీశారు. అనంతరం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతి చెందిన వారు సివిల్ ఇంజినీర్ జగన్నాథ్‌రెడ్డి, డ్రైవర్ సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే దేవరకద్ర రైల్వేస్టేషన్లో విద్యుత్తు వైర్లపై చెట్టుకొమ్మలు పడటంతో రైలు కొంతసేపు స్టేషన్లోనే ఆగిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

