Ghatkesar | విందుకు వెళ్లివస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఐటీ ఉద్యోగులు దుర్మరణం
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలోని ఏదులాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదులాబాద్ వద్ద అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలోని ఏదులాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదులాబాద్ వద్ద అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులు మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, మాధారంలోని విందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్‌పురికి చెందిన వర్షిత్‌గా గుర్తించామన్నారు. ప్రమాదంలో ప్రవీణ్ యాదవ్, దినేశ్ గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

