ఇద్దరు రైతుల ఆత్మహత్య.. ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటనలు
పంట దిగుబడిరాక, అప్పుల భారంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం కచంటికి చెందిన రైతు బొల్లి రాజేశ్వర్ (66) మూడెకరాల్లో పత్తిపంట వేశాడు.
- దిగుబడి లేక పురుగులమందు తాగిన కౌలురైతు
బేల/ ఎదులాపురం, అక్టోబర్ 15 : పంట దిగుబడిరాక, అప్పుల భారంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం కచంటికి చెందిన రైతు బొల్లి రాజేశ్వర్ (66) మూడెకరాల్లో పత్తిపంట వేశాడు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.35 లక్షల పంట రుణం తీసుకున్నాడు. వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి ఆశించిన స్థాయిలో రాదనే బెంగతో మంగళవారం తన చేనులో పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రాజేశ్వర్ కొడుకు దత్తు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు.
బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన కౌలు రైతు ఉరడే అవినాశ్(40) తనకున్న నాలుగెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాడు. నాలుగెకరాల్లో సోయా, మరో నాలుగెకరాల్లో పత్తి, కంది వేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం, సాగుకు చేసిన రూ.1.50 లక్షలకుపైగా అప్పు ఎలా తీర్చాలనే బెంగతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం చేనులో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అవినాశ్ భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు బేల ఎస్సై మధుకృష్ణ తెలిపారు. అవినాష్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

