Ranganayaka Sagar | రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం.. ఇద్దరు పిల్లలు గల్లంతు
Ranganayaka Sagar | చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం నెలకొంది. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు.
Ranganayaka Sagar | సిద్దిపేట : చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం నెలకొంది. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
వేసవి సెలవుల నేపథ్యంలో ఓ రెండు కుటుంబాలు ఇవాళ రంగనాయక సాగర్ రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆ కుటుంబాలకు చెందిన పిల్లలు సరదాగా ఆడుకుంటూ నీళ్లల్లో దిగారు. దీంతో బాలుడు, బాలిక నీటిలో గల్లంతయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. రిజర్వాయర్ వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రిజర్వాయర్‌లో పడిన బాలుడు మిరాజ్(15), బాలిక అర్బాస్(15)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

