మానవ హక్కుల సంఘం పేరిట
మానవ హక్కుల సంఘం పేరిట హోటల్, బేకరీ యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోటలోని జీటీ నారాయణ స్కూల్ యజమాని రాఘవేందర్, పెద్దమందడి మండలం వెల్టూర్‌కు చెందిన దయ్యాల శేఖర్ జీటీ నారాయణ స్కూల్ వద్ద కొన్నినెలల కిందట జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.
- వసూళ్లకు పాల్పడిన ఇద్దరి అరెస్టు
కొత్తకోట, నవంబర్ 10 : మానవ హక్కుల సంఘం పేరిట హోటల్, బేకరీ యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోటలోని జీటీ నారాయణ స్కూల్ యజమాని రాఘవేందర్, పెద్దమందడి మండలం వెల్టూర్‌కు చెందిన దయ్యాల శేఖర్ జీటీ నారాయణ స్కూల్ వద్ద కొన్నినెలల కిందట జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జీటీ రాఘవేందర్ కొనసాగుతూ దయ్యాల శేఖర్‌ను కొత్తకోట మండల అధ్యక్షుడిగా నియమించి వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో శేఖర్ అన్ని హోటళ్లు తిరుగుతూ అక్కడ ఏమైన అవకతవకలు ఉంటే వాటిని రాసుకొని జీటీ రాఘవేందర్‌కు చేరవేసేవాడు. రాఘవేందర్ సదరు హోటల్ యజమానులకు ఫోన్‌చేసి తన ఆఫీస్‌కు పిలిపించుకొని బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పట్టణంలోని మంజునాథ టిఫిన్ సెంటర్ యజమాని అడివేశ్గౌడ్ తన వద్ద రూ.50వేలు వసూలు చేశారని రెండు రోజుల కిందట కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేసి రాఘవేందర్, శేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

