ఉద్యాన పంటలకు మరింత ప్రోత్సాహం: తుమ్మల
ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యానశాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని సూచించారు.
తెలంగాణలో పండించిన కూరగాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని, ఆ దిశగా ఉద్యాన శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు విసృ్తత అవకాశాలున్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఏకీకృత నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

