Adilabad | లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్.. కొనసాగుతున్న ఆదిలాబాద్ బంద్
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో తుడుం దెబ్బ, ఏజెన్సీ నాయకులు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించారు.
ఆదిలాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో తుడుం దెబ్బ, ఏజెన్సీ నాయకులు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక బంద్ నేపథ్యంలో దుకాణాలు తెరచుకోలేదు.
జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు.రు. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీ సామాజికవర్గాన్ని తొలగించి అడవి తల్లిపై ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని ఆదివాసులకు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ర్టాలలో బీసీ, ఎస్సీగా ఉన్న ఆ సామాజికవర్గం, తెలంగాణలో ఎస్టీ జాబితాలో కొనసాగుతుండటం వల్ల ఆదివాసీలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎస్టీ వర్గీకరణతోనే రాష్ట్రంలో ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ సంఘాలు పేర్కొంటున్నాయి. సుప్రీం తీర్పును అనుసరించి ఎస్టీ జాబితాలోని తెగలను జనాభా ప్రకారం లెక్కించి వర్గీకరించాలని కోరుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Adilabad Bandh
- Lambada
- st
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

