హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) నంబర్ పొగొట్టుకున్న వారికి కమిషన్ వెబ్సైట్లో ఆప్షన్ ఇచ్చింది. అభ్యర్థులు పాత ఐడీని పొందేందుకు know your tspsc id ఆప్షన్ ఎంచుకోవాలి. దాంట్లో ఆధార్‌నంబర్, పుట్టిన తేదీ వివరాలను పొందుపరిస్తే అభ్యర్థి ఓటీఆర్ నంబర్ ప్రత్యక్షమవుతుంది.
ఓటీఆర్ నంబర్ ఆధారంగా ఎడిట్ ఓటీఆర్ (క్యాండిడేట్ లాగిన్) ఆప్షన్ ఎంచుకొని, కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ ఓటీఆర్ నమోదు ఒక శాతం పెరిగింది. 25 లక్షల మంది గతంలోనే ఉండగా, తాజాగా 25,194 అభ్యర్థులు ఓటీఆర్ చేసుకొన్నారు. ఓటీఆర్‌లో శనివారం వరకు 72,692 మంది మాత్రమే స్థానికత, విద్యార్హత వివరాలను మార్చుకొన్నారు.