హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): స్త్రీ,శిశుసంక్షేమశాఖలో చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) పోస్టుల భర్తీకి జనవరి 3న టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష మెరిట్ జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 1:2 నిష్పత్తిన అభ్యర్థులతో జాబితా రూపొందించింది. మెరిట్ లిస్ట్‌ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నది.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుదికీ
స్త్రీ,శిశు సంక్షేమశాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఈవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుదికీని టీఎస్పీఎస్సీ బుధవారం విడుదల చేసింది. జనవరి 8న రాత పరీక్ష నిర్వహించగా అదేనెల 20న ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా తుది కీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఇంటర్వ్యూ మార్కుల జాబితా విడుదల
సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ అండ్ రిసెర్చ్ కాలేజీలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించిన ఇంటర్వ్యూ మార్కుల జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.
నేటితో ముగియనున్న గ్రూప్-2 దరఖాస్తు
గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనున్నది. బుధవారం రాత్రి వరకు 4,83,640 దరఖాస్తులు వచ్చినట్టు కమిషన్ పేర్కొన్నది. గ్రూప్-3 ఉద్యోగాలకు 3,83,537 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది.