టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్ఎన్పీడీసీఎల్ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు.
- 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఆగస్టు 14న రాతపరీక్ష
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్ఎన్పీడీసీఎల్ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో ఐదేండ్లు, దివ్యాంగులకు మరో 10 ఏండ్లు గరిష్ఠ వయోపరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు. వివరాలకు http://tsnpdcl.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. తాజా నోటిఫికేషన్‌తో కలుపుకొని ఇప్పటివరకు 20,473 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. త్వరలోనే మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

