TS Weather | బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు..!
TS Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
TS Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ పేర్కొంది.
హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణశాఖ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తరవాయవ్య దిశగా కదులుతోందని వివరించింది. ఈ నెల 3 నుంచి 6 వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
మహారాష్ట్ర, కొంకన్ తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మంగళవారం నుంచి 5 రోజులు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఉంటుందని, ఆ తర్వాత 94 నుంచి 106 శాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

