TS TET | ఎట్టకేలకు టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా..
TS TET | ఎట్టకేలకు టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు అందుబాటులోకి వచ్చాయి హాల్ టికెట్లు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినప్పటికీ ఒక రోజు ఆలస్యమైంది.
TS TET | హైదరాబాద్ : ఎట్టకేలకు టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు అందుబాటులోకి వచ్చాయి హాల్ టికెట్లు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినప్పటికీ ఒక రోజు ఆలస్యమైంది. నిన్నటి నుంచి టెట్ అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మొత్తానికి గురువారం సాయంత్రం టెట్ హాల్ టికెట్లను వెబ్సైట్లో ఉంచారు.
టెట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలంటే జర్నల్ నంబర్, పుట్టిన తేదీ(టెన్త్ మెమో) తప్పనిసరి. ఈ రెండు లేకపోతే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడం అసాధ్యం. దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించినప్పుడు జర్నల్ నంబర్ జనరేట్ అయి ఉంటుంది. ఆ నంబర్‌తో పాటు పుట్టిన తేదీని సమర్పించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం https://tstet2024.aptonline.in/tstet ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.
ఇక టెట్ పరీక్షలు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

