TS Polycet 2023 | మే 17న పాలిసెట్ ప్రవేశ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుతించరు
TS Polycet 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 17వ తేదీన(బుధవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
TS Polycet 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 17వ తేదీన(బుధవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించనున్నారు. అబ్బాయిలు 58,468 మంది, అమ్మాయిలు 47,188 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 1,05,656 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు..
పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్టుకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ వెంట హెచ్బీ బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకోని రావాలని సూచించారు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కాని వారు ఒక పాస్పోర్టు సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

