హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి గాను స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను సాంకేతిక విద్యామండలి అధికారులు సోమవారం విడుదల చేశారు. మంగళవారం నుంచి ఫీజు చెల్లింపు.. సర్టిఫికెట్ల అప్లోడింగ్కు అవకాశం కల్పించగా, 9 – 13 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇక ఈ నెల 16న సీట్లను కేటాయించనుండగా, విద్యార్థులు 16 -17 తేదీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.