టీఎస్ పాలిసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్ – 2022 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 20 నుంచి 23వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 27న సీట్లను కేటాయించనున్నారు. 27 నుంచి 31వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు.. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఫైనల్ ఫేజ్ షెడ్యూల్
ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల విధివిధానాలను వెల్లడించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

